TOC

This article is currently in the process of being translated into Telugu (~93% done).

Getting started:

Hello, WPF!

ఏ నిర్దేశకభాష (ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్) లో అయినా మొదటి మరియు అతి ముఖ్యమైన ఉదాహరణ "హలో, వరల్డ్ !", కానీ ఈ ట్యుటోరియల్ లో దానిని మనము "హలో, డబ్ల్యు పీ ఎఫ్ !" గా మార్పుచేద్దాము. చాలా సులభముగా ఈ వాక్యాన్ని కంప్యూటర్ స్క్రీన్ పైన కనిపించేలాగా చేసి, దీనిని నేర్చుకోవడం సులభం అని అర్ధంచేసుకుని ప్రారంభించే విధముగా ప్రోత్సహించడమే దీని లక్ష్యము.

ఈ ట్యుటోరియల్ యొక్క మిగిలిన భాగం మీవద్ద ఒక IDE వ్యవస్థాపించబడిందన్న భావనతో ముందుకు కొనసాగుతుంది, ప్రాధాన్యంగా విజువల్ స్టూడియో లేదా విజువల్ స్టూడియో కమ్యూనిటీ (దాన్ని ఎలా పొందాలో సూచనల కోసం మునుపటి కథనాన్ని చూడండి). మీరు మరొక ఉత్పత్తిని ఉపయోగిస్తుంటే, మీరు మీ ఉత్పత్తికి తగ్గ సూచనలను స్వీకరించాలి.

విజువల్ స్టూడియోలో, ఫైల్(File) మెను(Menu) నుండి క్రొత్త ప్రాజెక్ట్ను(New Project) ఎంచుకోవడం ద్వారా ప్రారంభించండి. ఎడమ వైపున, మీకు వర్గాల చెట్టు(tree of categories) ఉండాలి. ఈ ట్యుటోరియల్ కోడ్ చేరినప్పుడల్లా సి #(c Sharp) పై దృష్టి పెడుతుంది, కాబట్టి మీరు దానిని టెంప్లేట్ల జాబితా(list of templates) నుండి ఎన్నుకోవాలి మరియు మనము విండోస్అప్లికేషన్లను (Windows Applicatons)సృష్టిస్తాము కాబట్టి, మీరు చెట్టు నుండి విండోస్ (Windows) ఎంచుకోవాలి. ఇది మీకు కుడి వైపున ఉన్న విండోస్ అప్లికేషన్ రకాల జాబితాను ఇస్తుంది, ఇక్కడ మీరు డబ్ల్యుపిఎఫ్ అప్లికేషన్‌ను (WPF Application) ఎంచుకోవాలి. నేమ్(Name) టెక్స్ట్ ఫీల్డ్‌(text field)లో నా ప్రాజెక్ట్‌ (project)కు "హలోడబ్ల్యుపిఎఫ్ (HelloWPF)" అని పేరు ఇవ్వడము జరిగింది. డైలాగ్ యొక్క దిగువ భాగంలోని మిగిలిన సెట్టింగులు సరిగ్గా ఉన్నాయని నిర్ధారించుకోండి, ఆపై OK బటన్ నొక్కండి.

మీ క్రొత్త ప్రాజెక్ట్‌లో కొన్ని ఫైల్‌లు ఉంటాయి, కాని వాటిలో ఒకదానిపై ఇప్పుడు మనము దృష్టి పెడదాము: MainWindow.xaml . ఇది అప్లికేషన్ ప్రాథమిక విండో, మీరు దీన్ని ప్రత్యేకంగా మార్చని పక్షంలో అప్లికేషన్ ప్రారంభించేటప్పుడు మొదటగా చూపబడినది. దానిలో కనిపించే XAML కోడ్ (XAML ఈ ట్యుటోరియల్ యొక్క మరొక అధ్యాయంలో వివరాలతో చర్చించబడింది) ఇలా ఉండాలి:

<Window x:Class="WpfApplication1.MainWindow"
xmlns="http://schemas.microsoft.com/winfx/2006/xaml/presentation"
xmlns:x="http://schemas.microsoft.com/winfx/2006/xaml"
Title="MainWindow" Height="350" Width="525">
    <Grid>

    </Grid>
</Window>

ఇది మన విండో కోసం విజువల్ స్టూడియో సృష్టించే బేస్ గ్జామల్ (base XAML) , దానిలోని అన్ని భాగాలు గ్జామల్ (XAML) మరియు "ది విండో (The Window)" లోని అధ్యాయాలలో వివరించబడ్డాయి. మన అప్లికేషన్ ప్రారంభించి (డీబగ్(Debug) ఎంచుకోండి -> డీబగ్గింగ్ ప్రారంభించండి (Start Debugging) లేదా F5 నొక్కండి) ప్రస్తుతం కలిగి ఉన్న ఖాళీ విండోను చూడవచ్చు, కానీ ఇప్పుడు మన సందేశాన్ని తెరపైకి తీసుకురావడానికి సమయం ఆసన్నమైంది.

We'll do it by adding a TextBlock control to the Grid panel, with our aforementioned message as the content:

<Window x:Class="WpfApplication1.MainWindow"
xmlns="http://schemas.microsoft.com/winfx/2006/xaml/presentation"
xmlns:x="http://schemas.microsoft.com/winfx/2006/xaml"
Title="MainWindow" Height="350" Width="525">
    <Grid>
<TextBlock HorizontalAlignment="Center" VerticalAlignment="Center" FontSize="72">
Hello, WPF!
</TextBlock>
    </Grid>
</Window>

ఇప్పుడు అప్లికేషన్ ప్రారంభించడానికి ప్రయత్నించండి (డీబగ్ (Debug) ఎంచుకోండి -> డీబగ్గింగ్ ప్రారంభించండి (Start Debugging) లేదా F5 నొక్కండి) మరియు మీ కృషి యొక్క అందమైన ఫలితాన్ని వీక్షించండి- ఇదే మీ మొదటి WPF అప్లికేషన్:

టెక్స్ట్ బ్లాక్ ను కస్టమ్ అలైన్‌మెంట్ (Custom Alignment) చేయడానికి (విండో మధ్యలో చూపడానికి HorizontalAlignment, VerticalAlignment ), అలాగే పెద్ద టెక్స్ట్ పొందడానికి ఫాంట్‌సైజ్(Font Size) ప్రాపర్టీని టెక్స్ట్‌బ్లాక్‌లో మూడు వేర్వేరు గుణాలు(Attributes) ఉపయోగించామని మీరు గమనించవచ్చు. ఈ భావనలన్నీ తరువాతి వ్యాసాలలో తెలియజేయబడతాయి.

దీన్ని ఇంత వరుకు సాధన చేసినందుకు అభినందనలు. ఇప్పుడు మిగిలిన ట్యుటోరియల్ చదవండి త్వరలో మీరు WPF ను స్వావలంబన(master) చేయగలుగుతారు!